Vijayawada: ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా డెమోక్రసీ ఫౌండేషన్ సమావేశం

Vijayawada: విజయవాడలో ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా డెమోక్రసీ ఫౌండేషన్ సదస్సు నిర్వహిస్తోంది. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 9 Oct 2026 5:59 PM IST
Vijayawada
X

Vijayawada: ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా డెమోక్రసీ ఫౌండేషన్ సమావేశం

విజయవాడ: ప్రజాస్వామ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం ప్రజాస్వామ్య విలువలు పతనమవుతున్న నేపథ్యంలో వాటిని కాపాడి, మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని డెమోక్రసీ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. అబ్బయ్య పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు: శాసన వ్యవస్థ (లెజిస్లేచర్), కార్యనిర్వాహక వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్), న్యాయ వ్యవస్థ (జుడిషియరీ), మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగు ప్రధాన స్తంభాలని వివరించారు.మీడియాపై ప్రజల ఆశలు మిగతా మూడు వ్యవస్థల నుంచి ఆశించిన ఫలితాలు అందనప్పుడు ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో మీడియా కీలక పాత్ర పోషించాలని అభిప్రాయపడ్డారు.డెమోక్రసీ ఫౌండేషన్ పరిచయం ఇది ఒక సివిల్ సొసైటీ సంస్థగా, థింక్ ట్యాంక్‌గా పనిచేస్తూ పరిశోధన, కొత్త ఆలోచనల ద్వారా మెరుగైన ప్రజాస్వామ్య నిర్మాణానికి కృషి చేస్తుందని తెలిపారు.

ఓటర్లకు అవగాహన కల్పించడం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ సంస్కరణలు, క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, యువత మరియు విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం వంటి 18 పరిష్కారాలను ప్రతిపాదించారు.సామాజిక విప్లవం ఆవశ్యకత: ప్రజాస్వామ్యంలో సమూల మార్పులు తీసుకురావడానికి సామాజిక మార్పులు, ప్రజల్లో చైతన్యం అవసరమని పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడంపై ఫౌండేషన్ దృష్టి సారిస్తోందని తెలిపారు. యువతలోని శక్తి, ఆలోచనలను సరైన విధంగా ప్రోత్సహించి, మార్గనిర్దేశం చేయకపోతే అవి దారి తప్పే అవకాశం ఉందని, సమాజంలోని వ్యక్తులకు ఉన్న విజ్ఞానం, మంచి ఆలోచనలు వేర్వేరుగా ఉండిపోకుండా అందరూ కలిసి పనిచేస్తే మెరుగైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని అన్నారు.

మీడియా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని కోరుతూ మీడియా ప్రతినిధులకు డెమోక్రసీ ఫౌండేషన్ తరఫున స్వాగతం పలికారు.అక్టోబర్ 10 మరియు 11 రెండు రోజుల పాటు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ఆనంద జ్యోతి నిలయం లో నిర్వహించనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ సెక్రెటరీ, డాక్టర్ డి.విజయలక్ష్మి సైకాలజిస్ట్ మెంబర్ ,డాక్టర్ కే. కృష్ణమోహన్ సైకాలజిస్ట్ యుఎస్ఏ మెంటార్ ఫర్ డెమోక్రసీ ఫౌండేషన్ ,జి .శివ.మెంబర్ డెమోక్రసీ ఫౌండేషన్ వ్యాపారవేత్త,డాక్టర్ ప్రత్యూ సుబ్బారావు ప్రముఖ సైకాలజిస్ట్ తది తరులు పాల్గొన్నారు....

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.