Vijayawada: విజయవాడ కొండ ప్రాంతాల అభివృద్ధికి పక్కా యాక్షన్ ప్లాన్: సుజనా
Vijayawada: విజయవాడ నగరాభివృద్ధి, కొండ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
Vijayawada: విజయవాడ కొండ ప్రాంతాల అభివృద్ధికి పక్కా యాక్షన్ ప్లాన్: సుజనా
విజయవాడ: విజయవాడ నగరాభివృద్ధికి, మరియు కొండ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
విజయవాడలో కొండ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల సమస్యలు అక్కడ చేపట్టాల్సిన నిర్మాణ సవాళ్లు మరియు విజయవాడ అభివృద్ధిపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో గురువారం సమీక్ష నిర్వహించారు..
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రజా ఫిర్యాదుల శాఖ మరియు ఎ ఎస్ సీ ఐ అమలు చేస్తున్న ఈ సమీక్షలో మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ , మున్సిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర , మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ,రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్, ఎ ఎస్ సీ ఐ డైరెక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ , గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కొర్లపాటి హెప్సిబా రాణి,స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కళాశాల డైరెక్టర్ శ్రీకొండ రమేష్,పలు ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యశాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ విజయవాడ నగరాభివృద్ధి తో పాటు కొండప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
పశ్చిమ లో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నామని తెలిపారు.
చెన్నైకి చెందిన పలు ఏజెన్సీల ప్రతినిధులతో కలిసి మురికినీటి వ్యవస్థ పారుదల, వరదనీటి నిర్వహణ ఎలా చేపట్టాలన్న అంశంపై కార్యశాలలో చర్చించామన్నారు.
ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా మార్చడంతో పాటు , పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు.
రానున్న దసరా ఉత్సవాల నేపథ్యంలో సామాన్య భక్తులకు సులభంగా, త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా సామాన్యులకు పెద్దపీట వేసేందుకు వినూత్న విధానాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు.
ఎ ఎస్ సీ ఐ డైరెక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు, సరైన ప్రణాళిక ఉంటే నిధులకు కొరత ఉండదు పట్టణాభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని పట్టణాభివృద్ధి కోసం యూసీఎఫ్ కింద రూ.లక్ష కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు.
వీటిని ఉపయోగించుకుంటే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కొండ ప్రాంతాలసమస్య ఒక్క రోజుతో పరిష్కారం అయ్యేది కాదన్నారు. అందరి సహకారంతోనే అది సాధ్యమని ప్రమాదకర ప్రాంతాల్లో ఉన్న వారికి విధిగా పునరావాసం కల్పించాలి.
సమస్యలు ఎక్కడున్నాయి, పరిణామాలు ఏంటనేది చూడాలన్నారు. ముందుగా సమస్యను గుర్తించి... దానికి పరిష్కారం ఆలోచించాలని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.




