Vijayawada: విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

Vijayawada: విజయవాడలో సెప్టెంబర్ 30న 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమం. 24,042 మంది అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు అందజేత.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 26 Sept 2026 10:57 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ

విజయవాడ: ఎన్నో ఏళ్లుగా సొంతింటి స్థలం కోసం ఎదురుచూస్తున్న విజయవాడ పేద ప్రజల కల నెరవేరే దిశగా “పేదలకు పట్టాభిషేకం” కార్యక్రమం జరగడం ఎంతో సంతోషకరం. సెప్టెంబర్ 30న 24,042 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్న,

ముఖ్యంగా విజయవాడ వన్‌టౌన్‌తో పాటు కొండ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, పట్టాలంటే ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత నందమూరి తారక రామారావు గారి హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు, నివాసానికి సంబంధించిన సహాయం అందిన సందర్భాలను అనేక కుటుంబాలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటాయి.

ఆ అవకాశం ద్వారా లబ్ధి పొందిన ఎన్నో కుటుంబాలు చిన్నచిన్న రుణాలు, తమ శ్రమతో ఇళ్లను నిర్మించుకుని స్థిరపడిన విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

అదే స్ఫూర్తితో నేడు కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్న, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు. మరియు అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక అభినందనలు.

ఇది కేవలం ఒక పట్టా పత్రం కాదు...ఒక పేద కుటుంబానికి భరోసా,ఒక కుటుంబానికి సొంతింటి కల, ఒక తరానికి స్థిరమైన భవిష్యత్తు, ఒక పేదవాడి ఆత్మగౌరవానికి గుర్తింపు.

గతంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీలు వచ్చినప్పటికీ, అనేక కుటుంబాలు పట్టాల కోసం ఎదురుచూశాయి. ఇప్పుడు అర్హులైన వారికి పట్టాలు అందేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఆ నిరీక్షణకు ముగింపు పలికే కార్యక్రమంగా ఇది నిలుస్తోంది. జిల్లా అధికారుల ప్రకారం అర్హులైన వారిని గుర్తించి పట్టాలు అందిస్తున్నామని, మిగిలిన అర్హులకు తదుపరి దశలో కూడా పట్టాలు ఇవ్వనున్నారు, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు... పేదల సొంతింటి కలకు కొత్త ఆశ...

సెప్టెంబర్ 30న విజయవాడ పేదలకు నిజమైన “పట్టాభిషేకం”! పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రజా పాలనకు అసలైన అర్థం

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.