Vijayawada:ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన 'వరుణ యాగం' ప్రత్యేక పూజలు!
Vijayawada: సమృద్ధిగా వర్షాలు కురవాలని విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా ఘాట్ వద్ద పవిత్ర కృష్ణానదిలో వేదపండితులు దీక్షాపూర్వకంగా వరుణ యాగం పూజలు ప్రారంభించారు.
Vijayawada:ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన 'వరుణ యాగం' ప్రత్యేక పూజలు!
Vijayawada: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో దేవస్థానంలో దీక్షాపూర్వకంగా వరుణ యాగం సంబందించిన పూజలు ప్రారంభం అయ్యాయి.
శుక్రవారం ఉదయం 06:15 నుండి శ్రీ దుర్గాస్నానఘాట్లో విఘ్నేశ్వర పూజతో వరుణ యాగ పూజా కార్యక్రమములు ప్రారంభం కాగా ప్రత్యేక పూజల్లో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )ఈవో వి కె శీనా నాయక్ పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అనువాక సహిత కారక పారాయణలు నిర్వహించారు. ఈ పారాయణలు కొరకు పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుంలోతు నీళ్లలో ఉండి సకాలంలో వర్షాలు పడాలని పారాయణం చేసారు.
Next Story




