Vijayawada: కొత్తపేటలో 1.3 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురి అరెస్ట్
Vijayawada: విజయవాడ టూ టౌన్ కొత్తపేటలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్. 1.3 కిలోల గంజాయి స్వాధీనం. 'ఈగల్ ఛాలెంజ్' సత్ఫలితాలనిస్తోందన్న డీసీపీ రామకృష్ణ.
Vijayawada: కొత్తపేటలో 1.3 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురి అరెస్ట్
విజయవాడ: విజయవాడ నగరం లోని టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న యువకులు నాయకులు తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుండి ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకున్నట్లు నగర డి సి పి గుణ్ణం రామకృష్ణ తెలిపారు.
ఈగల్ ఛాలెంజ్ లో బాగంగా నమ్మకమైన వ్యక్తుల సమాచారం మేరకు టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డిసిపి గుణ్ణం రామకృష్ణ తెలిపారు.. సమాచారం అందించి వ్యక్తి కి ఐదువేలు నగదు బహుమతి అందించామని పేర్కొన్నారు.
నిందితులలో కట్టా ప్రసాద్ పాత నేరస్థుడు కాగా మీగిలిన ఇద్దరు ఎస్ కే అస్గర్,మహ్మద్ ఇబ్రాహీం ఖలీల్ లు ఒరిస్సా రాష్ట్రం రాయగడ్ లో రూ 15 వేలకి రెండుకేజిలు కొనుగోలు చేసి నగరంలో విక్రయించి డబ్బులు సంపాదించాలనే ఆలోచన చేయటంతో రాబడిన విశ్వసనీయ సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
నగర కమీషన్ రాజశేఖర్ బాబు రుపొందించిన గంజాయి,డ్రగ్స్ విక్రయాలపై ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమం సత్ఫలితాలు అందిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమం లో వెస్ట్ జోన్ ఏసిపి దుర్గారావు,సిఐ కొండలరావు పాల్గొన్నారు..




