Vijayawada: ఇంద్రకీలాద్రిపై భక్తులకు పటిష్ట ఏర్పాట్లు: ఎంపీ కేశినేని చిన్ని

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 24 గంటల పర్యవేక్షణ, తాగునీటి సరఫరా ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 11 Oct 2026 8:04 PM IST
Vijayawada
X

Vijayawada: ఇంద్రకీలాద్రిపై భక్తులకు పటిష్ట ఏర్పాట్లు: ఎంపీ కేశినేని చిన్ని

Vijayawada: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి సన్నిధిలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించడంతో పాటు, దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తెలిపారు. ఆదివారం ఇంద్ర‌కీలాద్రి మీడియా పాయింట్ వ‌ద్ద ఉన్న‌త అధికారుల‌తో క‌లిసి ఆయ‌న మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భక్తులకు అవసరమైన తాగునీటిని నిరంతరంగా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే స్పందించేందుకు అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.

భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని ఉత్సవాల్లో పాల్గొనేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా భ‌క్తుల నుంచి అభిప్రాయాలు సేక‌రించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఎవ‌రైనా ఎక్క‌డైనా స‌మ‌స్య ఉంద‌ని స‌మాచారం అందిస్తే యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.