Vijayawada: విజయవాడలో ‘నవరాత్రి డాండియా నైట్ 2026’ పోస్టర్ ఆవిష్కరణ
Vijayawada: విజయవాడలో అక్టోబర్ 18న 'నవరాత్రి డాండియా నైట్ 2026' వేడుకలు. గురునానక్ కాలనీలోని స్వర్ణ కన్వెన్షన్‌లో నిర్వహణ, పోస్టర్ ఆవిష్కరణ.
Vijayawada: విజయవాడలో ‘నవరాత్రి డాండియా నైట్ 2026’ పోస్టర్ ఆవిష్కరణ
విజయవాడ: నగరంలోని ఇందిరియా జ్యువెలర్స్‌లో సుభశ్రీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘నవరాత్రి డాండియా నైట్ 2026’ కార్యక్రమం పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి స్ప్రింగ్ బోర్డ్ ఇంటర్నేషనల్ ప్రీ-స్కూల్, విజయవాడ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, విక్టోరియా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ జిల్సీ, ఫ్యాషన్ షో డైరెక్టర్ ఇమ్మానియల్ పొకల్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, విజయవాడ నగర ప్రజలకు నవరాత్రి వేడుకలను మరింత ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నవరాత్రి డాండియా నైట్ 2026 కార్యక్రమం అక్టోబర్ 18, 2026న సాయంత్రం 6 గంటల నుంచి స్వర్ణ కన్వెన్షన్, గురునానక్ కాలనీ, విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక దుర్గ హారతి, డీజే, గర్బా నైట్, డాండియా నైట్, ఫుడ్ స్టాల్స్, ఫోటోబూత్ తదితర ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయనున్నారు.
విజయవాడ నగర ప్రజలు, కుటుంబ సభ్యులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నవరాత్రి పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.
తేదీ: 18 అక్టోబర్ 2026
సమయం: సాయంత్రం 6 గంటల నుంచి
వేదిక: స్వర్ణ కన్వెన్షన్, గురునానక్ కాలనీ, విజయవాడ
నవరాత్రి సందడి… డాండియా ఉత్సాహం… గర్బా వేడుకలతో విజయవాడలో మరో ప్రత్యేకమైన సాయంత్రానికి సిద్ధం అవుతోంది!




