Vijayawada: వంగవీటి రంగాపై అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి

Vijayawada: వంగవీటి రంగాపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఫేక్ సోషల్ మీడియా ఖాతాలపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాయల సేన అధ్యక్షుడు పోరుమామిళ్ల ఈశ్వర్ డిమాండ్ చేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 9 Oct 2026 6:01 PM IST
Vijayawada
X

Vijayawada: వంగవీటి రంగాపై అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి

విజయవాడ: వంగవీటి మోహనరంగా పై అసభ్యకర పోస్టులు పెట్టిన ఫేక్ సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని రాయల సేన అధ్యక్షులు పోరుమామిళ్ల ఈశ్వర్ కోరారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూఫేక్ ఖాతాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా జీవితంపై, ఆయన కుటుంబంపై, ముఖ్యంగా ఆయన తల్లిగారిపై అసభ్యకర వ్యాఖ్యలు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగా జీవిత చరిత్ర, వంగవీటి వంశ చరిత్రపై అవగాహన ఉన్నవారు ముసుగులో ఉండకుండా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

రంగా గారికి ప్రజల్లో ఆదరణ, రంగా మరణించి నాలుగు దశాబ్దాలు గడిచినా, యువతతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆయనను ఆదర్శంగా భావిస్తూ విగ్రహాలు ఏర్పాటు చేసి స్మరించుకుంటున్నారని పేర్కొన్నారు.ధనిక వర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచినందుకే రంగా పై రౌడీ, గూండా వంటి ముద్రలు వేశారని విమర్శించారు.

ఆయన చేసిన పోరాటాల గురించి ఆధారాలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. రంగా గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాపు సమాజానికి, ఇతర సామాజిక వర్గాలకు మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవద్దని కోరారు.

పోలీసులకు, ప్రభుత్వానికి ,రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, వివాదాస్పద పోస్టులకు సంబంధించిన నకిలీ ఖాతాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.సంబంధిత సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు కేసు నమోదు ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు.

కులాల మధ్య, పార్టీల మధ్య విభేదాలు పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, చరిత్ర తెలియకుండా ఒక సామాజిక వర్గంపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.ఈ నెలాఖరులోగా సంబంధిత ఖాతాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రంగా అభిమానులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని నిలువరించాలని, నకిలీ ఖాతాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వేల్పూరి శ్రీనివాస్ ముళ్ళ మూడి నాగేశ్వరరావు, కుంభ వెంకటేశ్వరరావు, పండలనేని వి ఎస్ గోపాల్, కూనపురెడ్డీ రమేష్, భూపతి మహేష్, చలమల శెట్టి శ్రీనివాస్, ఆకుల తిరుమలరావు తోట భాస్కర్, తోట సాంబశివరావు, అడపా ప్రతాప్, మోదుగ శివ, రామాయణపు సాంబయ్య మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.