Vijayawada: విజయవాడ దుర్గగుడి తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పణ
Vijayawada: కాణిపాకం వినాయక బ్రహ్మోత్సవాల్లో దుర్గగుడి తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈఓ వి.కె. శీనానాయక్.
Vijayawada: విజయవాడ దుర్గగుడి తరఫున కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పణ
విజయవాడ: కాణీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్బంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నుండి ఈరోజు పట్టువస్త్రాలు సమర్పించడమైనది.
ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ),కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనానాయక్, అర్చకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్,వైదిక కమిటీ సభ్యులు ఈరోజు ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించారు.
చైర్మన్,కార్యనిర్వాహణాధికారి, సిబ్బందికు కాణీపాకం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రీ పెంచల కిషోర్ స్వాగతం పలికి, ఆలయ మర్యాదలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ లింగంబొట్ల దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట రవి కుమార్, ముఖ్య అర్చకులు శ్రీ ఆర్. శ్రీనివాస శాస్త్రి, వైదిక కమిటీ సభ్యులు శ్రీ వి. శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.




