Vijayawada: 56వ డివిజన్‌లో జోరుగా వైసీపీ ప్రచారం: వెలంపల్లి

Vijayawada: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహించి, వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 20 Oct 2026 10:37 PM IST
Vijayawada
X

Vijayawada: 56వ డివిజన్‌లో జోరుగా వైసీపీ ప్రచారం: వెలంపల్లి

Vijayawada: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 56 వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఖుద్దూస్ నగర్ విధి నుంచి ప్రారంభమైన ఈ పర్యటనలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు, స్థానిక డివిజన్ వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి తలతోటి మనోరంజన్ కుమార్ తో కలిసి కేసీబీ కాలనీ గుంట ప్రాంతం కేదారేశ్వర పేట 5 నుంచి 8 లైన్లు మరియు పరిసర ప్రాంతాలలో ఇంటింటికీ తిరుగుతూ ముమ్మర ప్రచారం నిర్వహించారు స్థానిక డివిజన్ తాత్కాలిక ఎన్నికల కార్యాలయం కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలను, ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వైసిపి మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిని, అలాగే 56వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తలతోటి మనోరంజన్ కుమార్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ:

గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు, పారదర్శక పాలన అందించారని గుర్తుచేశారు. ఆ అభివృద్ధి, సంక్షేమ పథకాలే నేడు పార్టీకి ప్రజల్లో కొండంత అండగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను గాలికొదిలేసి తీవ్రంగా విఫలమైందని, ప్రజల్లో కూటమి పాలనపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తమ ఆగ్రహాన్ని చూపి వైసిపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి అభ్యర్థుల విజయానికి అంకితభావంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో డివిజన్ స్థాయి వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ ప్రతినిధులు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.