Vijayawada: విజయవాడ పశ్చిమంలో వైసీపీలోకి భారీ చేరికలు

Vijayawada: విజయవాడ పశ్చిమ 47వ డివిజన్‌కు చెందిన సీపీఎం, జనసేన నాయకులు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 20 Oct 2026 10:39 PM IST
Vijayawada
X

Vijayawada: విజయవాడ పశ్చిమంలో వైసీపీలోకి భారీ చేరికలు

Vijayawada: స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయంలో 47వ డివిజన్‌ ఇతర పార్టీ లకు చెందిన పలువురు వైసిపి లో చేరారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో సిపిఎం నుంచి పిళ్ల రాజేష్, జనసేన నుంచి కొయ్య దుర్గాప్రసాద్, గూడేల అశోక్ కుమార్ మరియు వారి మిత్రమండలి వైఎస్సార్‌సీపీ లో చేరారు . వారికి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ: 47వ డివిజన్ నుంచి ఇతర పార్టీ ల నుంచి వైసిపిలో చేరడం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ పట్ల ఉన్న ఆదరణకు నిదర్శనమని . ప్రస్తుత కూటమి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటామని, డివిజన్ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అని జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవాడ నగర మేయర్ అభ్యర్థి గా పోటీ చేయుచున్న రాయన భాగ్యలక్ష్మి ని, డివిజన్ కార్పొరేటర్ వైసిపి అభ్యర్థిగా పోటీ చేయుచున్న గురుమహంతు మహేష్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేసారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.