Vijayawada: మంత్రి నారాయణతో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు భేటీ

Vijayawada: విజయవాడలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కలిసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు.

GOPI, PENDURTHI
Published on: 23 May 2026 3:56 PM IST
Vijayawada
X

Vijayawada: మంత్రి నారాయణతో బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు భేటీ

Vijayawada: ఈరోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారిని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు శనివారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉత్తర నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి గారితో ఎమ్మెల్యే చర్చించారు. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం, తాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.

నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు మంత్రి గారిని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీ నారాయణ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను 150 వరకు పెంచాలని కూడా ఎమ్మెల్యే మంత్రి గారిని కోరారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల దృష్ట్యా వార్డుల పెంపు అవసరమని వివరించారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story