Vijayawada: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రాఖీ కట్టిన మహిళలు!

Vijayawada: విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు మహిళా సోదరీమణులు ఆప్యాయంగా రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 28 Aug 2026 2:56 PM IST
Vijayawada
X

Vijayawada: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు రాఖీ కట్టిన మహిళలు!

Vijayawada: విజయవాడలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గన్నవరం నియోజకవర్గానికి చెందిన మహిళా సోదరమణిలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు నుదుటన తిలకం దిద్ది, మిఠాయిలు తినిపించారు.

అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి సోదర–సోదరీమణుల ఆప్యాయ అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ అని అన్నారు. ఇలాంటి పండుగలు కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story