Vijayawada: శాప్ కార్యాలయం ముట్టడికి వైయస్సార్‌సీపీ యత్నం ఉద్రిక్తత!

Vijayawada: విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల అక్రమాలపై వైయస్సార్‌సీపీ శ్రేణులు శాప్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 21 Sept 2026 4:11 PM IST
Vijayawada
X

Vijayawada: శాప్ కార్యాలయం ముట్టడికి వైయస్సార్‌సీపీ యత్నం ఉద్రిక్తత!

Vijayawada: కూటమి ప్రభుత్వంలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలు, పచ్చి బరితెగింపుపై బెజవాడ నగరం రణరంగంగా మారింది. క్రీడాకారుల భవిష్యత్తును తాకట్టు పెడుతూ, నిబంధనలను తుంగలో తొక్కుతూ అర్హులకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని నిలదీసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో శాప్ (SAAP) కార్యాలయం వద్ద నిరసన జ్వాలలు మిన్నంటాయి.

మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసిపి ఇన్‌చార్జ్ శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం శ్రేణులతో తరలివచ్చి భారీ ఎత్తున కదంతొక్కారు. శాప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కదిలివచ్చిన జనప్రవాహాన్ని చూసి హడలిపోయిన కూటమి ప్రభుత్వం, రెడ్ సర్కిల్, స్టేడియం పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి భారీ బారికేడ్లతో అప్రజాస్వామికంగా అడ్డుకునేందుకు కుట్ర పన్నింది.

తోపులాట.. ఉద్రిక్తత.. హోరెత్తిన నినాదాలు:

పోలీసుల అక్రమ నిర్బంధాలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ—"భయం ఉన్న చోట విజయం ఉండదు.. తెగింపు ఉన్న చోట ఓటమి ఉండదు" అన్న సంకల్పంతో వైయస్సార్‌సీపీ శ్రేణులు దూసుకెళ్లాయి. బారికేడ్లను సైతం లెక్కచేయకుండా కార్యకర్తలు ముందుకు కదలడంతో పోలీసులు-ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగి, శాప్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ ఉద్రిక్తంగా మారాయి. కూటమి ప్రభుత్వ అవినీతి, పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలతో బెజవాడ దద్దరిల్లింది.

సీబీఐతో విచారణ జరపాల్సిందే – మాజీ మంత్రి వెలంపల్లి డిమాండ్ఈ. సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు: "రాష్ట్రంలో కూటమి పాలన వచ్చాక ప్రతి ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లోనూ కళ్లుచెదిరే స్కాంలే దర్శనమిస్తున్నాయి. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో నిబంధనలన్నింటినీ కాలరాసి, రక్తం ధారపోసి మెడల్స్ సాధించిన అసలైన క్రీడాకారుల పొట్టకొట్టారు.

అర్హులైన క్రీడాకారులను రోడ్డున పడేసి, అనర్హులకు, పైరవీకారులకే పోస్టులు కట్టబెడుతూ శాప్ కార్యాలయాన్ని అవినీతి అడ్డాగా మార్చేశారు. ఈ స్పోర్ట్స్ కోటా కుంభకోణంపై తక్షణమే సీబీఐ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలి. అర్హులకు న్యాయం జరిగే వరకు, అవినీతి అక్రమార్కులను, వారికి కొమ్ముకాస్తున్న ప్రభుత్వ పెద్దలను కటకటాల వెనక్కి నెట్టే వరకు వైయస్సార్‌సీపీ పోరాటం ఆగదు."

రాష్ట్రంలోని నిరుద్యోగులు, క్రీడాకారుల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని, కూటమి ప్రభుత్వ దోపిడీ పాలనను ప్రజల తరఫున ఎండగడుతూనే ఉంటామని ఆయన హెచ్చరించారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.