Visakhapatnam: విశాఖ జూలో కొత్త కళ.. 128 కొత్త జీవాల జననం!
Visakhapatnam: ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులు మొత్తం 128 కొత్త జీవాలకు జన్మనిచ్చాయి. శాస్త్రీయ సంరక్షణ చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
Visakhapatnam: విశాఖ జూలో కొత్త కళ.. 128 కొత్త జీవాల జననం!
Visakhapatnam: విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో 12 రకాల జంతువులు, పక్షులు 128 కొత్త జీవాలు జన్మనివ్వడం సంతోషకరమైన విషయం. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన శాస్త్రీయ సంరక్షణ, పునరుత్పత్తి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇది రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ చర్యలకు మరింత బలం చేకూరుస్తోంది.
కృత్రిమ ఇంక్యుబేషన్ ద్వారా 10 ఎర్ర అడవి కోడి పిల్లలు, ఒక బ్లూ–గోల్డ్ మకావ్ పిల్లను విజయవంతంగా పొదిగించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ పునరుత్పత్తి ప్రక్రియలో భాగస్వాములైన అటవీ శాఖ అధికారులు, జూలాజికల్ పార్క్ సిబ్బంది, వెటర్నరీ బృందానికి హృదయపూర్వక అభినందనలు.
ప్రతి కొత్త జీవం మనలో కొత్త ఆశలు నింపుతుంది. ఒక జాతిని కాపాడటం అంటే మన ప్రకృతి సంపదను కాపాడుకోవటమే. శాస్త్రసాంకేతికతను ఉపయోగిస్తూ జీవవైవిధ్యాన్ని భావితరాలకు అందించేలా ఆంధ్రప్రదేశ్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.




