Vizag: మధురవాడలో ఎగిరిన కార్మిక జెండా.. 140వ మేడే వేడుకలు ఘనం!

Vizag: విశాఖపట్నం మధురవాడలో సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 140వ మేడే ఉత్సవాలు నిర్వహించారు.

GOPI, PENDURTHI
Published on: 1 May 2026 12:52 PM IST
Vizag
X

Vizag: మధురవాడలో ఎగిరిన కార్మిక జెండా.. 140వ మేడే వేడుకలు ఘనం!

Visakhapatnam: రోజుకు 8 గంటలు పని దినం కోసం పోరాడి విజయం సాధించుకున్న రోజు మేడే అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు తెలిపారు. శుక్రవారం మధురవాడ హైస్కూల్ వద్ద, సిపిఐ కార్యాలయం వద్ద మేడే పతాకాలను ఎగురవేసి పైడిరాజు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలు, త్యాగాలు, హక్కులను స్మరించుకునే రోజు మేడే అని 1886లో చికాగోలో కార్మికులపై జరిగిన కాల్పుల జ్ఞాపకార్థం, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో 1923 నుండి ఈ రోజును సెలవుదినంగా పాటిస్తున్నారని అన్నారు.

మన దేశంలో 50 కోట్లు మంది ఉన్న కార్మికవర్గంలో 45కోట్లు మంది అసంగటిత కార్మికులని, వీరిలో 16 నుండి 18 కోట్ల మంది వలస కార్మికులని వీరిలో అత్యధికముగా దళితులు, స్త్రీలు, మైనారిటీలు ఉన్నారని, పోరాటాలు ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా అమలు చేస్తున్నదని కార్మిక చట్టాలు యదావిదిగా అమలుకోసం కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం డి బేగం, బి కేశవయ్య, ఏఐటీయూసీ నాయకులు ఎం బంగారయ్య, కె చిన్న, రమణ అధిక సంఖ్యలో ముఠా కార్మికులు పాల్గొన్నారు.

GOPI, PENDURTHI

GOPI, PENDURTHI

Next Story