Vizag: అరిలోవలో 3.7 కేజీల గంజాయి స్వాధీనం - ముగ్గురి అరెస్ట్!

Vizag: అరిలోవలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3.7 కిలోల గంజాయి కారు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.

JAI RAM, MADURAWADA
Published on: 4 Sept 2026 7:53 AM IST
Vizag
X

Vizag: అరిలోవలో 3.7 కేజీల గంజాయి స్వాధీనం - ముగ్గురి అరెస్ట్!

Vizag: ఆరిలోవ బిఆర్‌టిఎస్ రోడ్డులోని డెంపింగ్ యార్డ్ సమీపంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అరిలోవ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.70 కేజీల గంజాయి,మహీంద్రాTUV 300కారు మరియు 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అరిలోవ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 248/2026 (NDPS యాక్ట్).​అరెస్ట్ అయినవారు.. పిన్నింటి శ్యామ్ చరణ్ (21, సీతమ్మధార),కేలవలస హేమంత్ కుమార్ (22, అక్కయ్యపాలెం),బోనుల ప్రవీణ్ తేజ (19,జగదాంబ సెంటర్). ​నిందితుల్లో మరొకరు అబ్స్క్యాండింగ్ ప్రధాన నిందితుడు అమీర్ పోలీసులను చూసి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు.​

విశ్వసనీయ సమాచారంతో అరిలోవ ఎస్ఐ హెచ్. వరహాల నాయుడు నేతృత్వంలో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.పరారీలో ఉన్న అమీర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story