Anakapalli: వి.మాడుగులలో 5 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరి అరెస్ట్!

Anakapalli: అనకాపల్లి జిల్లా వి.మాడుగుల సమీపంలో 5 కిలోల గంజాయి స్వాధీనం. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 29 Aug 2026 7:59 AM IST
Anakapalli
X

Anakapalli: వి.మాడుగులలో 5 కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరి అరెస్ట్!

Anakapalli: అనకాపల్లి జిల్లా వి.మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం. కోడూరు శివారు ప్రాంతంలో, ఏజెన్సీ నుంచి గంజాయి తరలి స్తున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేసి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నారాయణరావు తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు 5 కిలోల గంజా యిని ఒడిశాలోని పాడువ ప్రాంతంలో కొనుగోలు చేసి పుణె పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు తీసుకు వెళ్తుం డగా పట్టుకున్నామని, కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story