Araku: పినకోట పేలుడు ఘటనపై అరకు ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి!

Araku: అల్లూరి జిల్లా పినకోట వద్ద రహదారి పనుల జిలెటిన్ స్టిక్స్ పేలి ఉపాధ్యాయురాలు సునీతతో సహా ఐదుగురు మృతి. అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తీవ్ర దిగ్భ్రాంతి.

REHAMAN, ARAKU
Published on: 24 Oct 2026 11:42 AM IST
Araku
X

Araku: పినకోట పేలుడు ఘటనపై అరకు ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి!

Araku: ఈ రోజు ఉదయం అనంతగిరి మండలం,పినకోట వద్ద రహదారి పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులను టీచర్ సునీత (విశాఖ), కార్మికుడు మణి (దేవరాపల్లి), నారాయణరావు (చీడికాడ), పవన్ కుమార్ (కడప) తో పాటు వాహన డ్రైవర్ గా గుర్తించారు.

పాఠశాల విధులకు వెళ్తున్న సమయంలో టీచర్ సునీత ఈ పేలుడు ఘటనలో చిక్కుకుని మృతి చెందడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదంపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ,వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవాలని,ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

REHAMAN, ARAKU

REHAMAN, ARAKU