Bheemili: శివుడి సేవకే జీవితం': భర్తకు మెసేజ్ పెట్టి మహిళ అదృశ్యం!

Bheemili: 26 ఏళ్ల అప్పికొండ మౌనిక అనే వివాహిత అదృశ్యమైన ఘటనపై ఆమె భర్త ఫిర్యాదు మేరకు భీమిలి సీఐ దివాకర్ యాదవ్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

SHIVA, BHIMILI
Updated on: 6 Sept 2026 11:52 PM IST
Bheemili
X

Bheemili: శివుడి సేవకే జీవితం': భర్తకు మెసేజ్ పెట్టి మహిళ అదృశ్యం!

భీమిలి: భీమునిపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పికొండ వీధి, భీమిలిలో నివాసం ఉంటున్న అప్పికొండ మౌనిక, వయస్సు 26 సంవత్సరాలు, అనే మహిళ అదృశ్యమైన సంఘటనపై ఆమె భర్త అప్పికొండ సురేంద్ర, వయస్సు 36 సంవత్సరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ దివాకర్ యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, తనకు సుమారు 10 సంవత్సరాల క్రితం తన దగ్గరి బంధువైన మౌనికతో పెద్దల సమక్షంలో వివాహం జరిగిందని, వారికి ఒక కుమార్తె ఉన్నారని, ఇప్పటివరకు ఎటువంటి ముఖ్యమైన కుటుంబ వివాదాలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నామని తెలిపారు. సురేంద్ర గ్యాస్ ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. గత సుమారు 8 నెలలుగా మౌనిక ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంచుకొని, భీమిలిలోని శివాలయానికి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం వెళ్తుండేది.

05-09-2026న సురేంద్ర తన విధులకు వెళ్లగా, మౌనిక ఇంటి వద్దనే ఉంది. సుమారు 16.00 గంటలకు తాను దేవాలయానికి వెళ్తున్నానని తన తమ్ముడు సందీప్‌కు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

అనంతరం సుమారు 17.00 గంటలకు, తనను తాను పరమశివునికి అంకితం చేసుకున్నానని, తన మిగిలిన జీవితాన్ని శివుని సేవలో గడపడానికి కోయంబత్తూరుకు వెళ్తున్నానని తన భర్త మొబైల్ ఫోన్‌కు సందేశం పంపింది. ఆ సందేశం అందుకున్న సురేంద్ర ఆందోళనకు గురై, మౌనిక కోసం భీమిలి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టడంతో పాటు బంధువులు మరియు తెలిసిన వారిని సంప్రదించి విచారించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story