Chodavaram: అనకాపల్లి జిల్లాలో 8 కిలోల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్ట్!

Chodavaram: అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద పోలీసుల వాహన తనిఖీల్లో 8 కిలోల గంజాయి స్వాధీనం. జీ.మాడుగుల మండలానికి చెందిన వ్యక్తి అరెస్ట్, బైక్ సీజ్.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 11 Oct 2026 3:18 PM IST
Chodavaram
X

Chodavaram: అనకాపల్లి జిల్లాలో 8 కిలోల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్ట్!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డాది వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.

పోలీసులు పట్టుకున్న వ్యక్తిని పొండే నాగరాజు, బీరం పంచాయతీ, జి.మాడుగుల మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా వాసిగా గుర్తించారు. అతని వద్ద నుంచి సుమారు 8 కిలోల గంజాయిని, దాని విలువ సుమారు రూ.1.50 లక్షలుగా అంచనా వేయబడింది, స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు జి.మాడుగుల ప్రాంతం నుంచి చోడవరం వైపు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గంజాయి రవాణాకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM