Anakapalli: మన్యపురట్లలో ఘనంగా 9వ రాష్ట్రీయ పోషణ మాసం ర్యాలీ!
Anakapalli: నాతవరం మండలం మన్యపురట్లలో 9వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు, అవగాహన ర్యాలీ. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని సీడీపీవో శ్రీగౌరి సూచన.
Anakapalli: మన్యపురట్లలో ఘనంగా 9వ రాష్ట్రీయ పోషణ మాసం ర్యాలీ!
అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో గల మన్యపురట్ల సచివాలయంలో శుక్రవారం అంగన్వాడి సూపర్వైజర్ కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోషణ మా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిడిపిఓ. శ్రీ గౌరీ మాట్లాడుతూ అధిక పోషణ విలువల గల ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సూచించారు.
అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషణ విలువలు గల ఆహారం గురించి వివరించి తల్లులు గర్భవతులు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతులుగా గర్భవతులు బాలింతలు పిల్లలు ఉంటారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో పుణ్యమంతుల బాబ్జి వనిమిన సర్వేశ్వర కుమార్. డి పి సి కిరణ్ ఎం.ఎల్.హెచ్.పి. కుమారి. ఈ ఎన్ ఎం. సచివాలయ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




