Visakhapatnam: విశాఖలో ఆటో, మోటార్ కార్మికుల ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు!
Visakhapatnam: ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ 4వ రాష్ట్ర మహాసభల్లో డ్రైవర్లకు సంక్షేమ చట్టం, బోర్డు ఏర్పాటు చేయాలని నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
Visakhapatnam: విశాఖలో ఆటో, మోటార్ కార్మికుల ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు!
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి ) రాష్ట్ర 4 వ మహాసభలు ఈరోజు, రేపు విశాఖపట్నంలో జరుగుతా ఉన్నాయి. మహాసభల సందర్భంగా ఈరోజు అనగా 20.8.2026 తేదీన ఉదయం 11 గంటలకే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభలో రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుండి ఆటో డ్రైవర్స్ మోటార్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓమనమూర్తి అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జెవి సత్యనారాయణమూర్తి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య ప్రసంగిస్తూ ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్స్ లక్షలాదిమంది సోయం ఉపాధితో బ్రతుకుతూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు.
మీరు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దయాదాక్షిణాలు లేకుండా వారు ఉపాధిని దెబ్బ కొట్టే విధంగా జీవో నెంబర్ 21 31ని తీసుకొని వచ్చి డ్రైవర్ల మెడకు ఉరితాడు తగిలించే విధంగా చర్యలు ఉన్నాయన్నారు. ఆటో డ్రైవర్ కు ప్రమాదకరంగా ఉన్న జీవోలు తక్షణం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి వారికి వచ్చే ఆదాయాన్ని గండి కొట్టడం వలన కుటుంబాల్ని అర్ధాకులతో పోషించుకోవలసిన దుస్థితి ఉందని తెలిపారు రాష్ట్రంలో 11 లక్షల మంది ఆటో క్యాబ్ డ్రైవర్స్ ఉంటే కేవలం 2 లక్షల 90 వేల మందికి మాత్రమే వాహన మిత్ర అమలు చేసిందని మిగతావారు సంగతి ఏంటని ప్రశ్నించారు.
ఆటో డ్రైవర్లు తమ బ్రతుకు బ్రతుకుదాం అన్నా వీలు లేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఆర్టిఏ ట్రాఫిక్ పోలీస్ ద్వారా విపరీతమైన ఫైన్స్ ని ఆటో డ్రైవర్ల పై వృద్ధి బలవంతం గా వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సు ని స్త్రీ శక్తి పథకాన్ని తీసుకొని వచ్చింది. దీనివల్ల ఆటో డ్రైవర్లకు వచ్చే బేరాలు 80% పడిపోయాయి. దీనివల్ల ఇతర ఉపాధి అవకాశాలు డ్రైవర్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆటో డ్రైవర్ల సంక్షేమానికి పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ పెన్షన్ వంటి అంశాలను పొందుపరుస్తూ సంక్షేమ చట్టాన్ని బోర్డుని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఐక్యంగా పోరాటాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
బహిరంగ సభలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి జె రాజారెడ్డి, ఆటో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫేక్. రహిమాన్, ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం మన్మధరావు, విశాఖ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు పడాల గోవిందు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ కాసుబాబు , ఏ.ఈశ్వర్, ఎస్. ముబారక్, సిరాజు, ఎం.శివ అడ్డూర్.శంకర్ సిహెచ్. సాయికుమార్, మధు రెడ్డి ఏఐటీయూసీ నాయకులు జె. రామకృష్ణ,పి.చంద్రశేఖర్ ఎన్. నాగభూషణ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు పి.చంద్రశేఖర్, ఎన్.నాగభూషణ్ రావు,జే.రామకృష్ణ, శ్రీమతి ప్రమీల కోటా.సత్తిబాబు కే.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.




