Anakapalli: అనకాపల్లి 112వ వార్డులో ఘనంగా కూటమి నేతల ఇంటింటి ప్రచారం!
Anakapalli: అనకాపల్లి 112వ వార్డు విజయరామరాజుపేటలో కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
Anakapalli: అనకాపల్లి 112వ వార్డులో ఘనంగా కూటమి నేతల ఇంటింటి ప్రచారం!
Anakapalli: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో అనకాపల్లి జీవీఎంసీ 112వ వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు, ఏపీయూఎఫ్ఐడీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి సూచనలతో విజయరామరాజుపేట పరిధిలోని 164వ బూత్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికీ వెళ్లి, ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనకాపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పాంప్లెట్లను ప్రతి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రజలతో మమేకమైన నాయకులు, వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




