Gajuwaka: గాజువాక 88వ వార్డులో నూకరాజు విజయం తథ్యం: కేఎన్ఆర్
Gajuwaka: గాజువాక 88వ వార్డులో బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కార్పొరేటర్ అభ్యర్థి సిరసపల్లి నూకరాజు విజయం తథ్యమని బీజేపీ ఇన్‌ఛార్జ్ కేఎన్ఆర్ స్పష్టం చేశారు.
Gajuwaka: గాజువాక 88వ వార్డులో నూకరాజు విజయం తథ్యం: కేఎన్ఆర్
గాజువాక: గాజువాక 88వ వార్డులో కూటమి తరపున టిడిపి జనసేన బలపరిచిన బిజేపి అభ్యర్థి సిరసపల్లి నూకరాజు ఎన్నికల ప్రచారంలో బిజేపి గాజువాక ఇంచార్జ్ రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి కమలం గుర్తు పై ఓటు వేసి కార్పొరేటర్ గా నూకరాజుని గెలిపించాలని కోరారు. అదేవిధంగా మేయర్ గా పోటీ చేస్తున్న డాక్టర్ ముక్కా శ్రావణి కి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
నూకరాజు మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ ప్రచారం ఓటర్ల స్పందన చూస్తుంటే,సిరసపల్లి నూకరాజు విజయం తధ్యమని అన్నారు. అడుగడుగునా మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. కార్యక్రమంలో శశిధరన్ పిల్లై ,గ్రామ పెద్దలు వరహాలరావు, వెంకటరమణ, ప్రసాద్, సురేష్, తాతారావు, రమణ, నూకరాజు, చిరంజీవి కూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




