Polavaram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అక్టోబర్ 9కి వాయిదా
Polavaram: పోలవరం జిల్లా కాకవాడ, రాకోట గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అక్టోబర్ 9వ తేదీకి వాయిదా పడినట్లు కలెక్టర్ తెలిపారు.
Chintoor: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అక్టోబర్ 9కి వాయిదా
పోలవరం: పోలవరం జిల్లా కాకవాడ,రాకోట గ్రామాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చేపట్టాల్సిన పర్యటన అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ శుక్రవారానికి వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
కాకవాడ, రాకోట గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటికే చేపట్టిన ఏర్పాట్లను కొనసాగిస్తూ,కొత్తగా నిర్ణయించిన షెడ్యూల్‌కు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పర్యటనకు సంబంధించి భద్రత, పారిశుద్ధ్యం,రహదారులు, విద్యుత్,తాగునీరు,వేదిక, హెలిప్యాడ్ తదితర ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.




