Paderu: అల్లూరి జిల్లా వంజంగి కొండల్లో మేఘాల ఊరేగింపు - పర్యాటక సందడి!

Paderu: అల్లూరి జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి కొండల్లో భానుడి వెలుగులు, మేఘాల ఊరేగింపు. పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలు.

SAI, PADERU
Published on: 6 Nov 2026 7:20 AM IST
Paderu
X

Paderu: అల్లూరి జిల్లా వంజంగి కొండల్లో మేఘాల ఊరేగింపు - పర్యాటక సందడి!

Paderu: అల్లూరి జిల్లాలో ఆవిష్కృతమైంది, పాడేరు మండలం వంజంగి కొండల్లో భానుడి వెలుగులు కొత్త రంగులు అద్దుకున్నాయి.​ మేఘాలు తేలియాడే కొండలు, సూర్యోదయం. ​సముద్ర మట్టానికి 3400 అడుగుల ఎత్తులో దట్టమైన మంచు కురిసే కొండల మధ్య పాల సముద్రం పొంగిపొర్లుతోందా అన్నట్లుగా మేఘాల ఊరేగింపు పర్యాటకులను కట్టిపడేస్తోంది!

పచ్చటి కొండల నడుమ తేలియాడే తెల్లటి మేఘమాలికలు చూస్తుంటే ఆకాశమే నేలకు దిగివచ్చిందా అనిపిస్తోంది.

​ఉదయాన్నే వెలుగులు విరజిమ్మే సూర్యోదయ వేళ ఆ ఎర్రటి కిరణాలు మంచు తెరలను తాకుతుంటే సరికొత్త కాంతులు చిందుతున్నాయి.

ఈ అద్భుతమైన నయన మనోహర దృశ్యాన్ని తిలకించడానికి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు వంజంగికి క్యూ కట్టారు. కిలకిలారావాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవిస్తూ ఈ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు.

SAI, PADERU

SAI, PADERU