Paderu: దారెలాలో ఘనంగా వినాయక నిమ్మజ్జన వేడుకలు!
Paderu: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం దారెలాలో ఘనంగా వినాయక నిమ్మజ్జనం, కోలాటాలు, దింసా నృత్యాలు.. పాల్గొన్న మాజీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి.
Paderu: దారెలాలో ఘనంగా వినాయక నిమ్మజ్జన వేడుకలు!
Paderu: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం దారెలా పంచాయతీ దారెలా గ్రామంలో వినాయకచవితి అణుపు సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. మండల పరిధిలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహం పెట్టి ఘనంగా నిర్వహించిన అనంతరం ఆదివారం గిరిజన సాంప్రదాయ దింసా నృత్యలతో గణేష్ నిమ్మజ్జనం ఘనంగా జరిగింది. గ్రామ సర్పంచ్ పాండురంగ స్వామి మహిళలతో కలిసి కోలాటాలు నడుమ అణుపు ఉత్సవం అనేక మందిని ఆకట్టుకుంది.
ఈ సందర్బంగా చెండా మోహన్ రావు ఆర్థిక సహాయంతో గ్రామంలో భక్తులకు అన్నసమారాధన ఏర్పాటూ చేసి అనేకమందికి స్వామి ప్రసాదాన్ని అందించారు. అలాగే వినాయక లడ్డు పాటను చెండా రమేష్ పాడి దక్కించుకున్నారు.
అనంతరం మాజీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి మాట్లాడుతూ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా గణేష్ నిమ్మజ్జనం జరగడం సంతోషంగా ఉందని ఆ వినాయకుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అలాగే భక్తులు కోరికలను నెరవేర్చాలని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని మాజీ సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చవిటియ గోపాలం,
సమారెడ్డి ఆనందరావు,రమేష్, సుమన్,మనోజ్, మహేష్,ఈశ్వరావు,చెట్టి భాస్కర్ రావు,చెండా రమేష్ గ్రామస్తులు మహిళాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




