Hukumpeta: రూ. 3 కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన దొన్నుదొర!
Hukumpeta: అల్లూరి జిల్లా హుకుంపేట కామయ్యపేట బిటీ రోడ్డు నిర్మాణానికి రూ. 3 కోట్లతో శంకుస్థాపన చేసిన ఆర్టీసీ రీజినల్ చైర్మన్ దొన్నుదొర.
Hukumpeta: రూ. 3 కోట్లతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన దొన్నుదొర!
Hukumpeta: అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తెగలవలసి పంచాయతీ పరిధిలో గల కామయ్యపేట బిటి రోడ్డుకు కూటమి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టింది.
ఈ రోడ్లో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ రోడ్డు గత కొంతకాలంగా గోతులు ఏర్పడడంతో వాహనాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీనిని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపీఎస్ఆర్టీసీ రివిజినల్ చైర్మన్ దొన్నుదొర మూడు కోట్ల రూపాయలతో వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.
ఈ రోడ్డు పనులు పూర్తయితే గిరిజనులకు రవాణా సదుపాయంతో పాటు వైద్య సదుపాయము కూడా మెరుగవుతుందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అరుకు ఇంచార్జ్ దొన్నుదొర తోపాటు తెలుగుదేశం మాజీ సర్పంచ్ కామేష్ కూటమి నాయకులు పాల్గొన్నారు.




