Paderu: క్షయ రహిత సమాజ సాధన కోసం 'జోష్ టీమ్స్'
Paderu: అల్లూరి జిల్లాలో క్షయ రహిత సమాజ సాధన కోసం 'జోష్ టీమ్స్' ప్రారంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీబీపై అవగాహన కల్పించాలని జేసీ శ్రీపూజ కోరారు.
Paderu: క్షయ రహిత సమాజ సాధన కోసం 'జోష్ టీమ్స్'
పాడేరు: సీతారామరాజు జిల్లా క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజ సాధన కోసం జిల్లా యంత్రాంగం, యువత సమన్వయంతో వినూత్నంగా కృషి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ జిల్లా తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం, కుమ్మరి పుట్టు పాడేరులోని శంకరన్ సమావేశ మందిరంలో జాతీయ ఆరోగ్య మిషన్ & జిల్లా క్షయ నివారణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో "క్షయ-ముక్త భారత్ అభియాన్" కార్యక్రమంలో భాగంగా 'జోష్ టీమ్ (JOSH TEAM)' ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రారంభోత్సవ సమావేశనికి జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా నమోదువుతున్న టీబీ కేసుల్లో ప్రతి నాలుగు కేసులలో ఒకటి భారతదేశంలోనే నమోదవుతుండటం గమనార్హమని పేర్కొన్నారు. ఆకలి, పోషకాహార లోపం, దారిద్య్రం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం ఈ వ్యాధి సంక్రమణకు ప్రధాన కారణాలని వివరించారు. బ్యాక్టీరియా వల్ల వ్యాపించే ఈ వ్యాధిపై గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
యువతను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేకంగా రూపాందించిన 'జోష్ టీమ్స్' క్షేత్రస్థాయిలో టీబీ లక్షణాలను ముందస్తుగా గుర్తించి, బాధితులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ క్షయ వ్యాధి (టీబీ) పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, బాధితులకు మెరుగైన పోషకాహారాన్ని అందించడం ద్వారా మాత్రమే క్షయ ముక్త భారత్‌ను సాధించగలమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరోధక, ప్రత్యేక సేవలకు ఉపయోగమని, నిక్షయ్ పోషణ్ యోజన అవగాహన సదస్సు నిర్వహించడం,
సమాజంలో ప్రతీ ఒక్కరిని భాగస్వాములను చేస్తూ టీబీ వ్యాధిపై చైతన్యం తీసుకరావడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. టీబీ బాధితులకు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, వైద్యుల సలహాల మేరకు క్రమం తప్పకుండా 6 నెలల పాటు పూర్తి స్థాయిలో మందులు వాడాలని సూచించడం, నాణ్యమైన వైద్యాన్ని అందించడంతో పాటు, బాధితులు వేగవంతంగా కోలుకోనేవిదంగా విటమిన్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు వంటి బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను రోగికి చూచించి వివరించాలన్నారు. అనంతరం సెల్ఫీ ఫోటో స్టాండ్ ప్రారంభించి, టి బి నివారణ కు సంబందించిన సమావేశంలో పాల్గొన్న వారి అందరితో టి బి అధికారిడాక్టర్ కిరణ్ కుమార్ ప్లేడ్జి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపిసిఎస్ చైర్మన్ డాప్పొడి వెంకట రమణ, మాజీ ఏంపిపి బొర్ర. విజయరాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రియాజ్ బైగ్ , జిల్లా క్షయ, కుష్టు & ఎయిడ్స్ నివారణాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, డిఇఓ ఎన్. భానుముర్తి రాజు, జిజి హెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎరయ్య, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గౌతమి, వివిధ శాఖల జిల్లా అధికారులు వైద్య విభాగానికి చెందిన సిబ్బంది, ఆశ వర్క్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




