Paderu: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణాన్ని కాపాడుకుందాం!
Paderu: వినాయక చతుర్థి వేళ మట్టి వినాయకులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ అల్లూరి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ పిలుపు.
Paderu: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దు పర్యావరణాన్ని కాపాడుకుందాం!
Paderu: ఏ ఎస్ ఆర్ జిల్లా పాడేరు, జిల్లా ప్రజలందరికి ఈ నెల 14 వ తేదిన జరగనున్న వినాయక చతుర్థి పండుగను పురస్కరించుకుని పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి వినాయక ప్రతిమలనే పూజించాలని జిల్లా జాయింటి కలెక్టర్ తిరుమాని శ్రీపూజ పిలుపునిచ్చారు.
శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మట్టి వినాయక ప్రతిమను కలెక్టరేట్ సిబ్బందికి ప్రదర్శిస్తూ, పంపిణి చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఈ సందర్బంగా మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నదులు, చెరువులు ఇతర జలవనరులు తీవ్రంగా కలుషితమవుతాయని, అది జలచరాలకు, పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుందని పేర్కొన్నారు.
పర్యావరణ స్పృహతో ప్రతీ ఇంట్లో మట్టి వినాయకులను నిలబెట్టి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని పిల్లలలో సృజనాత్మకత పెంచే విదంగా, అలాగే పిల్లలు స్వయంగా తమ చేతులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం వల్ల వారిలో సృజనాత్మకత, పర్యావరణం పట్ల, అవగాహన బాధ్యత పెరుగుతాయన్నారు.
జలవనరుల పరిరక్షణ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితం కాకుండా చూడటం అందరి బాధ్యత అని, ప్రకృతిని రక్షించుకుంటూ, సాంప్రదాయబద్ధంగా పండుగను సంతోషంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలందరికీ జాయింట్ కలెక్టర్ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి ఏం వి ఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ, కలెక్టరేట్ సూపరింటెండెంట్, వివిధ సెక్షన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




