Paderu: రెవెన్యూ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: జాయింట్ కలెక్టర్!
Paderu: రెవెన్యూ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: అల్లూరి జిల్లా జేసీ తిరుమని శ్రీపూజ. రీ-సర్వే, పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక.
Paderu: రెవెన్యూ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: జాయింట్ కలెక్టర్!
పాడేరు: అల్లూరి జిల్లా పాడేరు శాఖపరమైన పనులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రెవెన్యూ విభాగాలు, పాలనా వ్యవహారాల పనితీరుపై జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమని శ్రీపూజ సంబంధిత శాఖాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అందించే సేవలలో ఎలాంటి జాప్యం జరగకుండా పారదర్శకంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే & రోర్ (ROR), శాశ్వత భూహక్కు-భూరక్ష (రీ-సర్వే) ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, భూ రికార్డుల ప్రక్షాళన (ROR) వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
ల్యాండ్ మేటర్స్ & రెవెన్యూ రికార్డ్స్, భూ వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నవీకరించాలని సంబంధిత సెక్షన్ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్స్ & మెజిస్టీరియల్ సమస్యలు, అలాగే రాబోయే ఎన్నికల సన్నాహకాలు, ఓటర్ల జాబితా సవరణలతో పాటు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మెజిస్టీరియల్ ఎంక్వైరీ రికార్డ్స్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఈ-గవర్నెన్స్ & సీఎం రిలీఫ్ ఫండ్, ఈ-గవర్నెన్స్ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయాలని, వివిధ రూపాల్లో అందే రిలీఫ్ (సహాయక) దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఎస్టాబ్లిష్మెంట్ & ఆర్‌ఆర్ యాక్ట్స్ కార్యాలయాల నిర్వహణ (ఎస్టాబ్లిష్మెంట్), ఆర్‌ఆర్ (Revenue Recovery) యాక్ట్ కింద బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Spandana/PGRS) ద్వారా వచ్చే అర్జీలకు ప్రాధాన్యతనిచ్చి, బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. సెక్షన్ సూపరింటెండెంట్ లకు, సీనియర్ జూనియర్ అసిస్టెంట్లకు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏం వి ఎస్ లోకేశ్వర రావు, కె. ఈశ్వర దొర, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే& ల్యాండ్ రికార్డ్స్, కలెక్టరేట్ ఏవో కె.అప్పలస్వామి, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్, డిప్యూటీ తాహశిల్దార్ పి.పోల్రాజు, ఆర్ ఓ ఎఫ్ ఆర్, ఎలక్షన్స్ సూపరింటెండెంట్ కె.కుమారస్వామి, పీజీ ఆర్ ఎస్ ఇంచార్జి ధర్మరాజు, సెక్షన్ సీనియర్ అసిస్టెంట్స్,ఇతర మండల స్థాయి శాఖాధికారులు, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.




