Kanchili: కంచిలి జడ్పీ పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు

Kanchili: కంచిలి జడ్పీ పాఠశాల పదో తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు ప్రకటించిన పూర్వ విద్యార్థి కొత్తకోట నాగరాజు. తండ్రి సర్వేశ్వరరావు జ్ఞాపకార్థం ప్రోత్సాహం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2026 7:32 AM IST
Kanchili
X

Kanchili: కంచిలి జడ్పీ పాఠశాల విద్యార్థులకు నగదు పురస్కారాలు

Kanchili: కంచిలి తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా మేలు చేయాలనే సంకల్పంతో మాజీ విద్యార్థి కొత్తకోట నాగరాజు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కొత్తకోట నాగరాజు 1985–86 నుంచి 1990–91 వరకు కంచిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన ఆయనకు తాను చదువుకున్న పాఠశాలపై ఉన్న అనుబంధంతో పాటు, ప్రస్తుత విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించి మరింత ఉన్నత ఫలితాలు సాధించేలా ప్రోత్సహించాలనే ఆలోచన కలిగింది.

ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించే ముగ్గురు విద్యార్థులకు తన తండ్రి స్వర్గీయ సర్వేశ్వరరావు జ్ఞాపకార్థం నగదు ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించారు.

ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10,000, ద్వితీయ స్థానానికి రూ.8,000, తృతీయ స్థానానికి రూ.5,000 చొప్పున అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని 80వ స్వాతంత్య్ర దినోత్సవం నుంచే ప్రారంభించడం విశేషం.

తాను చదువుకున్న పాఠశాలకు తనవంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి, మరింత కష్టపడి చదివేలా స్ఫూర్తి కల్పించాలన్నదే నా లక్ష్యం.

నా తండ్రి స్వర్గీయ సర్వేశ్వరరావు జ్ఞాపకార్థం ఈ ప్రోత్సాహకాలను అందించడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కొత్తకోట నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story