Anakapalle: అనకాపల్లిలో రోడ్లెక్కిన అంగన్‌వాడీలు
Anakapalle: అనకాపల్లి జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల భారీ నిరసన ర్యాలీ. చైతన్య యాప్‌ను రద్దు చేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్.
Anakapalle: అనకాపల్లిలో రోడ్లెక్కిన అంగన్‌వాడీలు
Anakapalle: తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ నిరసన ర్యాలీతో హోరెత్తించారు. సీపీఎం (CPM) పార్టీ మద్దతుతో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో వందలాది మంది అంగన్‌వాడీలు పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పట్టణంలోని సీపీఎం ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ నాలుగు రోడ్ల జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ మీదుగా నెహ్రూ చౌక్ వరకు సాగింది. సుమారు 2,000 మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలతో కూడిన నిరసనకారులు నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద భారీ మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ సంఘం నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'చైతన్య యాప్' (Chaitanya App) వల్ల తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, ఈ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము చేస్తున్న శ్రమకు తగినట్లుగా "పనికి తగ్గ జీతం" ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరారు.




