Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!
Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో ఘనంగా దీపావళి వేడుకలు. 15 అడుగుల నరకాసురుడి దిష్టిబొమ్మను దహనం చేసిన జనసేన ఇన్చార్జ్ భీమరశెట్టి రాంకీ.
Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు!
Anakapalle: అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో దీపావళి పండుగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆశీస్సులతో, అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రాంకీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించారు.
శ్రీ బాల గణపతి సేవా సమితి, శివరాధ్య ఆశ్రమం, గవరపాలెం వారి సౌజన్యంతో, కర్రీ రామకృష్ణ ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నారులు, యువత ప్రదర్శనలతో వేడుకల ప్రాంగణం సందడిగా మారింది.
అనంతరం నరక చతుర్దశిని పురస్కరించుకుని బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సుమారు 15 అడుగుల ఎత్తైన నరకాసురుడి దిష్టిబొమ్మను భీమరశెట్టి రాంకీ చేతుల మీదుగా దహనం చేశారు. నరకాసుర వధ కార్యక్రమంతో గవరపాలెంలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ సందర్భంగా భీమరశెట్టి రాంకీ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దీపావళి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.




