Anakapalle: జీవీఎంసీ 112వ డివిజన్‌లో ఘనంగా టీడీపీ ఆత్మీయ సమావేశం

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 112వ డివిజన్‌లో టీడీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఓటర్ వెరిఫికేషన్, కూటమి గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 3 Oct 2026 10:59 PM IST
Anakapalle
X

Anakapalle: జీవీఎంసీ 112వ డివిజన్‌లో ఘనంగా టీడీపీ ఆత్మీయ సమావేశం

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని నూతనంగా ఏర్పడిన జీవీఎంసీ 112వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం శనివారం ఘనంగా నిర్వహించారు. పాత 82వ, 83వ వార్డులకు సంబంధించిన ప్రాంతాలతో ఏర్పడిన 112వ డివిజన్‌లో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు 112వ డివిజన్ టీడీపీ ఇన్‌ఛార్జ్ పోలరపు త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, బూత్ ఏజెంట్లు, యూనిట్ ఇన్‌ఛార్జ్‌లు, టీడీపీ అనుబంధ సంస్థల కమిటీ సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలరపు త్రినాథ్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ వెరిఫికేషన్‌పై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తమ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు లేదా తేడాలు ఉంటే వెంటనే సరిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి సీటు కేటాయించినా, నిర్ణయాన్ని గౌరవించి అభ్యర్థి విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విస్తృతంగా వివరించాలని, ముఖ్యంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాల ద్వారా వారికి కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయంతో పాటు డివిజన్‌లో టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, అంకితభావంతో పనిచేయాలని పోలరపు త్రినాథ్ కోరారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI