Anakapalle: అనకాపల్లిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ప్రారంభం

Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో దివంగత కర్రీ రమేష్ జ్ఞాపకార్థం ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలను జనసేన నేత భీమరశెట్టి రామ్కీ ప్రారంభించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 13 Oct 2026 11:58 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ప్రారంభం

అనకాపల్లి: గవరపాలెంలో తెలుగు నాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గౌరీ సేవా సంఘం ప్రోత్సాహంతో, శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై నాటకోత్సవాలను ప్రారంభించారు.

దివంగత కర్రీ రమేష్ జ్ఞాపకార్థం నాటకోత్సవాలు

స్వర్గీయ కర్రీ రమేష్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శివ అందిస్తున్న శాశ్వత ఆర్థిక సహకారంతో ప్రతి సంవత్సరం ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నారు. తెలుగు నాటక రంగాన్ని పరిరక్షించడంతో పాటు, నాటక కళాకారుల్లోని ప్రతిభను వెలికితీయడం, వారికి తగిన వేదికను కల్పించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం: రామ్కీ

ఈ సందర్భంగా భీమరశెట్టి రామ్కీ మాట్లాడుతూ, తెలుగు నాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్న నిర్వాహకులను అభినందించారు. కళలు, సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణలో ఇటువంటి నాటకోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్రతో పాటు పలువురు ప్రముఖులు, నిర్వాహకులు, కళాభిమానులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI