Anakapalle: అత్యధిక మెజారిటీ వార్డుకు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు!
Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సంచలన ప్రకటన. అత్యధిక మెజారిటీ వచ్చే ఆరు వార్డులలో ఒకదానికి రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయింపు.
Anakapalle: అత్యధిక మెజారిటీ వార్డుకు రూ. 2 కోట్ల ప్రత్యేక నిధులు!
అనకాపల్లి: జీవీఎంసీ పరిధిలోని ఆరు వార్డుల ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక హామీ ప్రకటించారు.
ఆరు వార్డుల్లో ఏ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ లభిస్తుందో.. ఆ వార్డు అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులకు అదనంగా ప్రత్యేకంగా రెండు కోట్ల రూపాయల నిధులు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ ప్రకటనతో ఆయా వార్డుల్లో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఓటర్లను కలుస్తూ, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ముందుకు సాగుతున్నారు.
మొత్తానికి, ఆరు వార్డుల్లో అత్యధిక మెజార్టీ సాధించే అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్యే ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి నిధులు ఏ వార్డుకు దక్కనున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరి.. రెండు కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు ఏ వార్డుకు దక్కుతాయో వేచి చూడాలి!




