Anakapalle: అనకాపల్లిలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు
Anakapalle: అనకాపల్లిలో ఘనంగా దివిసీమ గాంధీ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పిలుపుమేరకు నివాళులర్పించిన కూటమి నాయకులు.
Anakapalle: అనకాపల్లిలో మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు
అనకాపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, "దివిసీమ గాంధీ"గా పేరుగాంచిన స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించిన సందర్భంగా అనకాపల్లిలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పిలుపుమేరకు స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరంలో మండలి వెంకట కృష్ణారావు చేసిన త్యాగాలు, సమాజ సేవ, ప్రజల అభ్యున్నతికి ఆయన అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని మండలి వెంకట కృష్ణారావుకు ఘన నివాళులు అర్పించారు.




