Anakapalle: కూటమి ఇంటింటి ఓటర్ల సర్వే: జోరుగా ఎన్నికల సన్నద్ధత!

Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 112వ వార్డులో కూటమి ఆధ్వర్యంలో ఇంటింటి ఓటర్ల సర్వే. ఓటర్ల వివరాల సేకరణతో పాటు స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్న నాయకులు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 30 Sept 2026 10:28 AM IST
Anakapalle
X

Anakapalle: కూటమి ఇంటింటి ఓటర్ల సర్వే: జోరుగా ఎన్నికల సన్నద్ధత!

Anakapalle: జీవీఎంసీ 112వ వార్డు పరిధిలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి ఆధ్వర్యంలో ఇంటింటి ఓటర్ల సర్వే కొనసాగుతోంది.

మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆదేశాల మేరకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ భీమరశెట్టి రామ్కి సూచనలతో కార్యక్రమం కొనసాగుతోంది.

కూటమి నాయకులు, కార్యకర్తలు వార్డులోని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబాల వారీగా ఓటర్ల జాబితాను పరిశీలించడంతో పాటు, స్థానిక సమస్యలు, ప్రజల అవసరాలను తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.

ఎన్నికల సన్నద్ధతలో భాగంగా బూత్‌ల వారీగా సమన్వయాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ఇంటింటి సర్వేను కొనసాగిస్తూ ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI