Anakapalle: అనకాపల్లిలో కొత్త రైతు బజార్.. రైతులకు, ప్రజలకు ఊరట

Anakapalle: అనకాపల్లిలో అధునాతన రైతు బజార్ ప్రారంభం. ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్‌లో 110 దుకాణాలతో ఏర్పాటు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 26 May 2026 9:59 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో కొత్త రైతు బజార్.. రైతులకు, ప్రజలకు ఊరట

Anakapalle: అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు బజార్‌ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ కృష్ణన్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, అధికారులు రైతు బజార్ ఏర్పాటుకు 2008 నుంచే ప్రయత్నాలు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు మరియు వినియోగదారులకు ఉపయోగపడేలా రాష్ట్రంలోనే విశాలమైన రైతు బజార్‌ను ఏర్పాటు చేయగలిగామని తెలిపారు.

ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్‌లో ఖాళీగా ఉన్న 17, 18 నంబర్ బ్లాకులను రైతు బజార్ కోసం వినియోగిస్తూ మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 110 దుకాణాలను నిర్మించగా, అందులో 72 దుకాణాలను రైతులకు, 25 దుకాణాలను డ్వాక్రా సంఘాలకు, మరో మూడు దుకాణాలను దివ్యాంగులకు కేటాయించినట్లు వెల్లడించారు.

అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్‌తో పాటు ఫిష్ మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రైతు బజార్ అందుబాటులోకి రావడంతో అనకాపల్లి పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగు చేసే రైతులకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించే అవకాశం కలగడంతో మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story