Anakapalle: జనసేన పార్టీ కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

Anakapalle: అనకాపల్లి జనసేన కార్యాలయంలో ఘనంగా వినాయక పూజలు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Sept 2026 6:13 AM IST
Anakapalle
X

Anakapalle: జనసేన పార్టీ కార్యాలయంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు

అనకాపల్లి: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భీమరశెట్టి రామ్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రామ్కి ఆకాంక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఆనందంగా జీవించేలా ఆశీర్వదించాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమంలో 108 వ వార్డు సభ్యులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూకాంబిక దేవస్థానం చైర్మన్ గొల్ల బాబు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, బుద్ధ రాందాస్, కాండ్రేగుల జోగేంద్ర,, భోగ లింగేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్ పెంటకోట గణేష్ కుమార్,కాండ్రేగుల ఉమా, కర్రి రామకృష్ణ, కొణతాల సందీప్, మద్దాల జగది, పెంటకోట కిరణ్, తదితరులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంతో జనసేన పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI