Anakapalle: తుపాను ధాటికి నేలకూలిన భారీ వృక్షం.. క్లియర్ చేసిన పోలీసులు

Anakapalle: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం అడ్డురోడ్డు వద్ద తుపాను గాలులకు నేలకూలిన భారీ చెట్టు. కిలోమీటర్ మేర నిలిచిన ట్రాఫిక్‌ను క్లియర్ చేసిన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది.

RAJU, PARAYAKARAOPETA
Published on: 28 Oct 2026 9:13 PM IST
Anakapalle
X

Anakapalle: తుపాను ధాటికి నేలకూలిన భారీ వృక్షం.. క్లియర్ చేసిన పోలీసులు

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా ,ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు జంక్షన్ సమీపంలో ఆర్నాబ్ తుపాన్ లో భాగంగా వీచిన గాలులకు జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ వృక్షం కూలిపోయింది.

దీంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హుటాహుటీనా నక్కపల్లి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ,రెవిన్యూ అధికారులు స్పందించారు.

కూలిన చెట్టును కట్ చేయించి పక్కకు వేసి ట్రాఫిక్ ని క్లియర్ చేసారు. సకాలంలో స్పందించిన పోలీస్ ,రెవిన్యూ సిబ్బంది పనితీరు పై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RAJU, PARAYAKARAOPETA

RAJU, PARAYAKARAOPETA