Anakapalle: వైఎస్సార్‌సీపీకి షాక్ – కొణతాల సమక్షంలో జనసేనలోకి!
Anakapalle: అనకాపల్లి జీవీఎంసీ 110, 112 వార్డుల వైఎస్సార్‌సీపీ నేతలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సమక్షంలో కండువాలు కప్పుకున్న నేతలు.
Anakapalle: వైఎస్సార్‌సీపీకి షాక్ – కొణతాల సమక్షంలో జనసేనలోకి!
అనకాపల్లి: జీవీఎంసీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. 110, 112వ వార్డులకు చెందిన నాయకులు జనసేన తీర్థం పుచ్చుకోవడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో పలువురు నాయకులు జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా తూర్పు కాపు సంఘం కార్యదర్శి పలకా రాముతో పాటు అప్పకొండ వెంకటరావు, వోమ్మీ వెంకట యాదవ్, మొగడా అప్పారావు, నాగేశ్వరరావు, వెంపరాల శర్మ, పలక నాగు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నాయకులను కొణతాల రామకృష్ణ సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఇన్‌ఛార్జ్, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
జీవీఎంసీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.




