Anakapalli: గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష!
Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పు. గంజాయి రవాణా కేసులో ఇద్దరు నిందితులకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా.
Anakapalli: గంజాయి రవాణా కేసులో ఇద్దరికి 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష!
Anakapalli: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన కేసులో నిందితులకు చోడవరం తొమ్మిదవ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానం (IXth ADJ Court) 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా విధిస్తూ చరిత్రాత్మక తీర్పునిచ్చింది.
కేసు వివరాలు మరియు కోర్టు తీర్పు:
దేవరపల్లి పోలీస్ స్టేషన్
క్రైమ్ నంబర్: 12/2016
ఎన్‌ఎస్‌సీ (NSC) నంబర్: 402/2017
న్యాయస్థానం: IX అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి కోర్టు, చోడవరం, అనకాపల్లి జిల్లా
గౌరవ న్యాయమూర్తి: శ్రీ ఎం.హరినారాయణ గారు
చట్టం & సెక్షన్లు: U/Sec. 20(b)(ii)(C) r/w 8(c) NDPS Act, సెక్షన్ 235(2) Cr.P.C.
నిందితుల వివరాలు:
A-1: కొసూరి ఈశ్వరరావు (29 సం.), తండ్రి: సన్యాసిరావు, ఆటో డ్రైవర్, తామరబ్బ గ్రామం, దేవరపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా.
A-2: దుంబరి రాజు (31 సం.), తండ్రి: సన్యాసిరావు, వార్డు మెంబర్, జీనబాడు గ్రామం, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా.
(గమనిక: ఈ కేసులో A-3 గా ఉన్న కుమారేశన్ మరణించారు. ఆయన డెత్ సర్టిఫికేట్ ఇంకా సమర్పించకపోవడంతో A-1, A-2 కేసు నుండి వేరు చేసి NSc. No. 695/2025 కింద నమోదు చేయడం జరిగింది).
ఖరారైన శిక్ష:
నేరం రుజువైనందున A-1 మరియు A-2 లకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష.
ఒక్కొక్కరికి రూ.1,00,000/- జరిమానా. జరిమానా చెల్లించని యెడల అదనంగా 2 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: 110 కిలోల గంజాయి (అప్పటి విలువ దాదాపు రూ.2,20,000/-), ఒక ఆటో (AP 31 TG 9487), 3 సెల్‌ఫోన్లు.
దర్యాప్తు మరియు ప్రాసిక్యూషన్ వాదనలు:
గతంలో దేవరపల్లి ఎస్సైగా పనిచేసిన డి.ఈశ్వరరావు గారు సమగ్రంగా దర్యాప్తు జరిపి, గంజాయి రవాణాకు సంబంధించిన పక్కా ఆధారాలు, సాక్ష్యాధారాలను సేకరించి గౌరవ న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.
కోర్టు విచారణలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణ గారు ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను, దర్యాప్తు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి శ్రీ ఎం.హరినారాయణ గారు నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారిస్తూ పైవిధంగా కఠిన శిక్షను ఖరారు చేశారు.
అభినందనలు మరియు జిల్లా ఎస్పీ హెచ్చరిక:
కేసును ప్రతిభావంతంగా దర్యాప్తు చేసి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్సై డి.ఈశ్వరరావు, ప్రాసిక్యూషన్ వాదనలు బలంగా వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ చీపురుపల్లి సూర్యనారాయణ, దేవరపల్లి పోలీస్ సిబ్బంది మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సభ్యులను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ:
గంజాయి, ఇతర మత్తు పదార్థాల సాగు, నిల్వ లేదా రవాణా చేసేవారు ఎవరైనా సరే చట్టం నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల రవాణాదారులపై జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. నేరస్థులకు కోర్టుల ద్వారా తగిన శిక్షలు పడేలా పక్కా సాక్ష్యాధారాలతో విచారణ కొనసాగిస్తాం.




