Anakapalli: నేతల పిల్లలు దేశంలోనే చదివేలా నిబంధనలు తేవాలని డిమాండ్!

Anakapalli: అనకాపల్లిలో నేతలు విదేశాల్లో చదివిస్తూ భారత విద్యా వ్యవస్థను అవమానిస్తున్నారని, దేశంలోనే చదివేలా నిబంధనలు తేవాలని ఆప్ డిమాండ్ చేసింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 25 Sept 2026 1:38 PM IST
Anakapalli
X

Anakapalli: నేతల పిల్లలు దేశంలోనే చదివేలా నిబంధనలు తేవాలని డిమాండ్!

Anakapalli: రాజకీయ నాయకులు తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తూ, దేశంలోని విద్యా వ్యవస్థపై నమ్మకం లేనట్టుగా వ్యవహరించడం సరికాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు అన్నారు. భారతదేశంలో చదివితే తమ పిల్లలు ఎందుకు పనికిరారని భావిస్తున్నారో రాజకీయ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

దేశంలో ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను నమ్మకుండా తమ పిల్లలను ఇతర దేశాలకు పంపించి చదివించడం ద్వారా భారత విద్యా వ్యవస్థను అవమానపరిచినట్టవుతుందని హరినాథ్ బాబు వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు తమ పిల్లలను దేశంలోనే చదివించేందుకు ఇష్టపడనప్పుడు, ఇదే దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు వారికి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే వారికి సంబంధించి తమ పిల్లల విద్యపై కూడా ఒక నిబంధన ఉండాలని హరినాథ్ బాబు అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో పోటీ చేసే నాయకుల పిల్లలు భారతదేశంలోనే చదువుకొని ఉండేలా నిబంధనలు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. విదేశాల్లో పిల్లలను చదివించే నాయకులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని, అలాంటి అభ్యర్థులను ప్రజలు ప్రోత్సహించకూడదని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశంలో చదువుకుంటున్న విద్యార్థులకు, ప్రభుత్వ విద్యా వ్యవస్థకు న్యాయం జరగాలంటే ఈ అంశంపై ప్రజలు గట్టిగా ఆలోచించాలని, తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ అనకాపల్లి జిల్లా శాఖ కోరుతోందని హరినాథ్ బాబు తెలిపారు

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI