Parawada: సంచార విముక్త జాతుల దినోత్సవ ఆహ్వాన పత్రం అందజేత
Parawada: ఈ నెల 31న అనకాపల్లిలో నిర్వహించనున్న సంచార-అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవ కార్యక్రమానికి పరవాడ మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతీ రమేష్‌కు ఆహ్వానం అందించారు.
Parawada: సంచార విముక్త జాతుల దినోత్సవ ఆహ్వాన పత్రం అందజేత
పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బిజెపి పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 31 వ తారీకు అనకాపల్లిలో నిర్వహించే సంచార - అర్ధ సంచార విముక్త జాతుల విముక్తి దినోత్సవ కార్యక్రమానికి పరవాడ మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతీ రమేష్ కు బిజెపి పార్టీ ఓబీసీ మోర్చా సభ్యులు ఆహ్వానం అందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దేశంలో సంచార జాతులను గుర్తించి వారికి గుర్తింపు, ప్రేరణతో సంచార జాతుల గౌరవాన్ని పెంచే విధంగా కార్యక్రమాల నిర్వహించే ఏకైక పార్టీ బిజెపి అని అన్నారు. సంచార జాతుల వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయాలని, వారికి విద్య అవకాశాలు అందించాలని, వారి కలలకు గుర్తింపు రావాలని ఆమె అన్నారు.
ఈనెల 31వ తారీకు సోమవారం అనకాపల్లి రావు గోపాలరావు కళాక్షేత్రంలో నిర్వహించే ఈ సంచార జాతులు స్ఫూర్తి సంస్కృతి వారదులు అనే కార్యక్రమానికి వివిధ సంచార జాతుల వారు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆమె సందర్భంగా కోరారు.
బిజెపి పెద్దలు, బిజెపి రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎంపీ సీఎం రమేష్ పాల్గొనే ఈ కార్యక్రమంలో సమాజమే శక్తిగా, సంస్కృతి జీవితంగా గౌరవంగా భావించి జీవించిన సంచార సమాజం దేశ ప్రజలకు స్ఫూర్తి నింపారు అని ధ్వనిద్ధం అని పిలుపునిచ్చారు.




