Anakapalli: బుచ్చయ్యపేటలో మేకల దొంగల అరెస్ట్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు

Anakapalli: తైపురంలో రైతు పెద్దరాజు మేకలను దొంగిలించిన ఇద్దరు నిందితుల అరెస్ట్. మేకలతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్న బుచ్చయ్యపేట పోలీసులు.

Venkata Thirumala
Published on: 2 July 2026 3:51 PM IST
Anakapalli
X

Anakapalli: బుచ్చయ్యపేటలో మేకల దొంగల అరెస్ట్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని బుచ్చయ్య పేట మండలం తైపురం గ్రామానికి చెందిన వియ్యపు పెద్దరాజు అనే రైతు తన మేకల పాక నుండి రెండు మేకలను గుర్తుతెలియని వ్యక్తులు మోటార్ సైకిల్‌పై అపహరించుకుని వెళ్లినట్లు ఫిర్యాదు చేయగా, బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.

దర్యాప్తులో భాగంగా పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలించగా, నిందితులను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనంతరం నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి చోరీకి గురైన రెండు మేకలను మరియు చోరీకి ఉపయోగించిన మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నిందితులుగా:

1. రావుల వాసు, తండ్రి: (లేట్) సుబ్బారావు, వయస్సు 24 సంవత్సరాలు, ఎస్.టి. (ఎరుకుల), ప్రస్తుతం గోట్లాం గ్రామం, కె.కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా (స్వస్థలం: గోకవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా).

2. రావుల మహేష్, తండ్రి: (లేట్) సుబ్బారావు, వయస్సు 30 సంవత్సరాలు, ఎస్.టి. (ఎరుకుల), గోట్లాం గ్రామం, కె.కోటపాడు మండలం, అనకాపల్లి జిల్లా.

వారిని అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్‌కు పంపింది. బుచ్చయ్య పేట ఎస్. ఐ మనోజ్ కుమార్ మాట్లాడుతూ..... ప్రజలు తమ ఇళ్ల వద్ద, పశువుల పాకాల వద్ద సాధ్యమైనంత వరకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

Venkata Thirumala

Venkata Thirumala

Next Story