Chodavaram: 'కప్పు - సాసర్' గుర్తుపై ఓటు వేయండి: దండుపాటి తాతారావు!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన సర్పంచ్ అభ్యర్థి దండుపాటి తాతారావు 'కప్పు - సాసర్' గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 23 Nov 2026 1:35 PM IST
Chodavaram
X

Chodavaram: 'కప్పు - సాసర్' గుర్తుపై ఓటు వేయండి: దండుపాటి తాతారావు!

చోడవరం: చోడవరం పంచాయతీ ఎన్నికలు... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చర్చించుకుంటున్న హాట్ టాపిక్ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? కూటమి తరపున జనసేన పార్టీ నుంచి దండుపాటి తాతారావు గారు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. టీడీపీ నుంచి ప్రధాన అభ్యర్థితో పాటు మరో ఇద్దరు రెబెల్ గా పోటీ చేస్తున్నారు. అంటే ఒకే కూటమి నుంచి నలుగురు బరిలో ఉన్నట్టే. దీంతో చోడవరంలో ఎన్నిక మరింత రసవత్తరంగా మారిపోయింది.

ఈ సందర్భంగా దండుపాటి తాతారావు గారు మాట్లాడుతూ... తనను గెలిపిస్తే చోడవరం ప్రధాన సమస్యలపైనే తన పూర్తి దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. చోడవరం విద్యార్థుల కోసం, ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే యువత కోసం గ్రంథాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

అంతేకాదు చోడవరం షుగర్ ఫ్యాక్టరీ రైతుల సమస్యపై స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అభివృద్ధి కోసం ఆలోచించే ప్రజలు తనను గెలిపిస్తే... అది జనసేన భావజాలాన్ని గెలిపించినట్టే అని తాతారావు గారు అన్నారు.

అవినీతి రహిత పాలన అంటే ఒక్క జనసేనకే సాధ్యమని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా రెండేళ్లలో... 20 ఏళ్లకు సరిపడా అభివృద్ధిని చోడవరం పంచాయతీలో చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. చివరగా తన గుర్తు కప్పు - సాసర్ పై తమ అమూల్యమైన ఓటు వేసి చోడవరం ప్రజలు తనను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM