Anakapalli: పేదలకు కొండంత భరోసా - సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
Anakapalli: అనకాపల్లిలో నిరుపేదలకు రూ. 2.91 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత. వైద్య సహాయం కోసం ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.
Anakapalli: పేదలకు కొండంత భరోసా - సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
అనకాపల్లి: అనారోగ్యంతో ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత భరోసాగా నిలుస్తోందని కూటమి నాయకులు పేర్కొన్నారు. పేదల ఆరోగ్య రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం CMRF ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో అందుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గుతోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన చికిత్స పొందిన లబ్ధిదారులకు సుమారు రూ.2,91,222 విలువైన CMRF చెక్కులను మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ కార్యాలయంలో స్వయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పిలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేని పేద కుటుంబాలకు CMRF ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. గత 25 నెలల కాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో వందలాది మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించినట్లు తెలిపారు.
భవిష్యత్తులోనూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
CMRF చెక్కులు అందుకున్న లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




